Header Banner

బాబోయ్.. విమానం బాత్రూంలో చిక్కుకున్న ప్రయాణికుడు.. సంస్థపై 3.4 మిలియన్‌ డాలర్ల భారం!

  Tue Apr 15, 2025 21:44        World

వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ (Boeing) విమానాల్లో తరచుగా సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురవుతుండడంతో ఆ సంస్థ పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో బోయింగ్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బోయింగ్ విమానం బాత్రూంలో చిక్కుకుపోయిన ఓ ప్రయాణికుడు ఆ డోర్ తెరవడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. చివరికి ఆ విమానాన్ని పైలట్లు దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్జేషన్ (FAA) రంగంలోకి దిగింది. బోయింగ్ పేరుతో రిజిస్టర్ అయిన దాదాపు 2612 బోయింగ్ విమానాల ప్రయాణ యోగ్యతపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమానయాన సంస్థను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి: భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

విమానంలోని గొళ్లెం డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రయాణికుడు బాత్రూమ్ తలుపులు తెరవలేకపోయాడని.. ఇటువంటి సమస్యలను నివారించడానికి బోయింగ్ అన్ని విమానాల్లోని గొళ్లాలను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి సంస్థలోని వాటాదారులకు మే 27వరకు గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే ఎఫ్ఎఏ చెప్పినట్లు చేస్తే.. బోయింగ్కు 3.4 మిలియన్ డాలర్ల భారం పడుతుందని అంచనా. అయితే విమానాలలోని బాత్రూమ్లలో సమస్యల వల్ల విమానాలను మళ్లించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఎయిర్ ఇండియా విమానంలోనూ ఇటువంటి సమస్య తలెత్తింది. ఓ ప్రయాణికుడు విమానంలోని బాత్రూమ్లలో బ్యాగ్లు, దుస్తులు ఫ్లష్ చేయడంతో అవి పని చేయకుండా ఆగిపోయాయి. దీంతో విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Boeing #FaultyBathroom #ViralNews #Airport